బిచ్కుంద జూలై 7 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గ్రామీణ యువతలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టికి తోడ్పడే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రోమైండ్స్ స్కిల్ కాటలీస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయం బిచ్కుండ పట్టణంలోని వీరభద్ర కాంప్లెక్స్ వద్ద ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ హన్మంత్ సిందే గారు (మాజీ ఎమ్మెల్యే - జుక్కల్) విచ్చేసి ప్రారంభోత్సవ రిబ్బన్ కత్తిరించి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ: “గ్రామీణ యువతకు నైపుణ్యాలు అందించేందుకు ఇలా సంస్థ స్థాపించడం అభినందనీయం. ఈ సంస్థ ద్వారా యువత ఉద్యోగ అవకాశాలను పొందడం ద్వారా వారి జీవితం వెలుగుల బాటలో నడుస్తుంది” అని అన్నారు.సంస్థ వ్యవస్థాపకుడు కె. గంగాధర్ గారు మాట్లాడుతూ:
“ప్రతి గ్రామీణ యువత నైపుణ్యాలు కలిగి, ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను అందుకోవాలి అనే దృష్టితో ప్రోమైండ్స్ స్కిల్ కాటలీస్ట్ ను స్థాపించాం. ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూల్ ప్రిపరేషన్, ఐటీ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం వంటి శిక్షణలు ఇవ్వబడతాయి” అని వివరించారు. ఈ ప్రారంభోత్సవంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, విద్యావేత్తలు, యువత పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సందర్శకులకు సంస్థ దిశగా తీసుకోబోయే కార్యక్రమాలపై వివరాలు తెలియజేశారు.