తెలంగాణ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూ.
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో
మండల అధ్యక్షులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి.
జనం న్యూస్ 7 జులై 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండలం ధూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ. సోమవారం రోజున హన్మకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్లో ధూప దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా సమావేశం జరిగిందని ఇట్టి సమావేశంలో దూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పంచకుండాత్మక చండి, కుబేర పాశుపత యాగం విశ్వావసు నామ సంవత్సరం ఆషాడమాసం తేది 14,07, 2025 సోమవారం నుండి,16,07,2025 బుధవారం వరకు మూడు రోజులు తుల్జాభవన్, ధర్మశాల, కాచిగూడ హైదరాబాద్ లో నిర్వహించడం గురించి మాట్లాడుకోవడం జరిగింది, అలాగే హన్మకొండ జిల్లా దూప దీప నైవేద్య అర్చకులు అందరూ పంచకుండాత్మక చండి, కుబేర పాశుపత యాగం కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూ లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని సకాలంలో వర్షాలు కురవాలని రాష్ట్రం లోని ప్రతి ఒక్కరు ఆయురారోగ్యం అష్టైశ్వర్యాలతో ఉండాలని సదుద్దేశంతో దూపదీప నైవేద్యం అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ, జిల్లా అధ్యక్షులు గణేష్ సిద్ధాంతి పిలుపుమేరకు హన్మకొండ జిల్లా అర్చకులందరూ ఇట్టి సమావేశంలో హాజరయ్యారు అందరు కూడా సానుకూలంగా స్పందించి దూప దీప నైవేద్య అర్చక సంఘం తరపున చేపట్టిన పంచకుండాత్మక చండి, కుబేర పాశుపత యాగం దిగ్విజయంగా జరపడానికి అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని హన్మకొండ జిల్లా దూప దీప నైవేద్య సంఘం నుండి అధ్యక్షులు కార్యదర్శులు అర్చకులు అందరూ ముక్తకంఠంతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు, సిద్ధాంతి గణేష్, కార్యదర్శి ఆరుట్ల మాధవాచార్యులు, కోశాధికారి మల్లయ్య, సహాయ కార్యదర్శి సదానిరంజన్ సిద్ధాంతి ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అర్చకులు పాల్గొన్నారు.