జనం న్యూస్ జూలై 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో, రైతులకు జరిగే శిక్షణ కార్యక్రమంలో భాగంగా జరిగే రైతు నేస్తం (వీడియో కాన్ఫరెన్స్) లో భాగంగా నేడు మంగళవారం ఉదయం 10 గంటలకు మునగాల, ఆకు పాముల, రేపాల గ్రామ రైతులకు అధిక సాంద్రత పత్తి సాగులో యాజమాన్యం మెలకువలు గురించి అవగాహన కార్యక్రమం ఉంటుందని సోమవారం ఒక ప్రకటనలో మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.