జనంన్యూస్. 08.సిరికొండ. ప్రతినిధి.
నిజమాబాద్ జిల్లా సిరికొండ మండలం జినిగాల గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ మాదిగ గారు మాట్లాడుతూ దండోరా అను ఆర్గనైజేషన్ 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో మంద కృష్ణ గారి నాయకత్వంలో ఆవిర్భవించిన ఈ దండోరా నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ ఈరోజు 31వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మన చిరకాల ఆకాంక్ష ఏ బి సి వర్గీకరణ జరిగింది కాబట్టి ఇప్పటికే మనం చదువులో వెనుకబడి ఉన్నాము ఇప్పుడైనా మన పిల్లలందరినీ మంచి మంచి చదువులు చదివించి ఏబీసీ వర్గీకరణ ద్వారా ఉన్నతమైన పదవులు పొందాలని అన్నారు ఇదే రోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు కావడం చాలా సంతోషించాల్సిన విషయం వారికి ఎమ్మార్పీఎస్ సిరికొండ మండలం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో జినిగాల ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ మరియు జీనిగాలా గ్రామస్తులు పాల్గొన్నారు.