జనంన్యూస్. 08.నిజామాబాదు. ప్రతినిధి.
మందులు వాడేకంటే ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది…!
పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు " మెగా వైద్య శిబిరం. ను పోలీస్ శాఖ ఆధ్వర్యం మల్లారెడ్డి, నారాయణ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో " ఈ కార్యాక్రమం నిర్వహించగా ముఖ్య అతిధులుగా. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., హజరుకావడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం మెగా వైద్య శిబిరం ను ప్రారంభించారు.ఈ సందర్భముగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ. సిబ్బంది ఎల్లప్పుడు విధులు నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ,ఆరోగ్యం పై అవగాహన ఎంతో ముఖ్యమనియు, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితులలో వ్యాధులు ఏంతో వేగంగా విస్తరిస్తున్నాయని, అట్టి వ్యాధుల భారీన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని మనం తీసుకునే అన్నిరకాల ఆహర పదార్థలలో కల్తీ చాలా గలదని, కొన్ని వ్యాదులకు గతంలో వైద్యం అందుబాటు లో ఉండేది కాదని ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాదునిక వైద్య సదుపాయాలు అందుబాటులో గలవని, ప్రత్యేకంగా ,ఆర్.బి.ఎస్, కంటి పరీక్ష, ఇ.సి.జి. 2డి ఈకో, క్యాన్సర్ స్క్రిన్నింగ్, బిపి, షుగర్, మొదలగు వైద్య పరీక్షల ద్వారా ఈ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, మనకు అందించే అందుబాటులో గల ఆరోగ్య భద్రతను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతీ సంవత్సరం ఒక్కసారై నను ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించవలెను. మందులు వాడేదానికంటే ముందు జాగ్రతలుతీసుకోవడం మంచిదని అన్నారు.ఇలాంటి క్యాంప్ ల ఏర్పాటు చేయడం ఎంతో భినందనియమని, ఈ క్యాంప్ నేడు ఉదయం 09 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వాహిస్తారని దీనిని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గల సిబ్బంది / పోలీస్ కార్యలయం సిబ్బంది / పోలీస్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది / హోమ్ గార్డ్సు మరియు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యాక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్) శ్రీ బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమీషనర్ ( ఎ.ఆర్ ) శ్రీ రామ్ చందర్ రావు , నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఎ.సి.పిలు శ్రీ రాజా వెంకట్ రెడ్డి, శ్రీ పి. శ్రీనివాసులు, శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీ శ్రీనివాస్ (అడ్మిన్ ), శ్రీ శేఖర్ బాబు ( ఎమ్.టి.ఓ ). శ్రీ తిరుపతి ( వెల్ఫేర్ ), శ్రీ సతీష్ (హోమ్ గార్డ్సు) పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డా॥ సరళ, మరియు డాక్టర్లు శ్రీ సుధాకర్ రావ్ ( సీనియర్ కార్డియాక్ సర్జన్ ) శ్రీ చంద్ర మోహన్ ( కార్డియాలాజిస్ట్ ) , ( శ్రీ వంశీ ( జనరల్ ఫిజీసియిన్ ) , అఫ్రిన్ ( గైనకొలేజిస్ట్) , నిఖిత (అన్ కలజీస్ట్ ) , షాహాభాజ్ హైమద్ ( ఆర్థో పెడిక్ ), జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ షకీల్ పాషా గారు పాల్గొన్నారు.