జనం న్యూస్ జులై(8)
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాలమండల కేంద్రంలో మంగళవారంనాడు తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షులు తోనుకునూరు రమేష్ గౌడ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో తాటి చెట్లపై నుండి పడి మరణించిన గీత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం నుండి అందవలసిన ఐదు లక్షల ఎక్స్గ్రేషియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఒక నెల రోజుల్లో పెండింగ్ ఎక్స్గ్రేషియా గౌడ కులస్తుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి వరకు అందేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తిరుమలగిరి మండల కేంద్రంలో జూలై 14 తేదీన జరిగే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఐదు లక్షలు ఇవ్వాలని లేని ఎడల పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి సభను అడ్డుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు రేసు వెంకన్న గౌడ్ జిల్లా గౌడ సంఘం నాయకులు గుండ్ల నాగేందర్ గౌడ్,మద్దెల శ్రీను గౌడ్, ఆకుల రమేష్ గౌడ్, మురళి గౌడ్, లింగరాజు గౌడ్,మహేష్ గౌడ్, మరియు మండల గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.