జనం న్యూస్ 8జులై. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ రిపోటర్.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ పేరిట జారీ చేసిన జీవో 49 ఆదివాసి హక్కులను కాలరాసే విధంగా ఉందని ఈ జీవోను వెంటనే రద్దుచేసి ఆ ప్రాంతంలో నివసించే గిరిజన గిరిజనేతరుల కు స్వేచ్ఛ కల్పించాలని మాజీ ఎంపీ సోయం బాపూరావు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కి కలిసి వినతిపత్రాన్ని అందజేశారు హైదరాబాదులోని గవర్నర్ నివాస గృహమైన రాజ్ భవన్ లో ఆదివాసీ నాయకులతో కలిసి గవర్నర్ తో ఆదివాసుల సమస్యల గురించి చర్చించారు. కొమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్ల ను ఏకపక్షంగా టైగర్ కన్జర్వేషన్ లో కలపడం వల్ల అడవులు అటవీ భూములను నమ్ముకొని బతికే గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ముందుకు వస్తున్న క్రమంలో జీవో 49 జారీ చేయడం తగదని సూచించారు. ఇప్పటికే ఈ జిల్లాలో జీవో 49 రద్దు చేయాలని ఆందోళనలు చేస్తున్నారని, దీనివల్ల 339 ప్రభావిత గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.ఆదివాసి గిరిజనులకు న్యాయం చేసేలా హామీ ఇచ్చినట్టు సోయంబాపూ రావు తెలిపారు గవర్నర్ ను కలిసిన వారిలో మాజీ ఎంపీ సోయం బాపూరావు తో పాటు జాతీయ అఖిల భారతీయ గోండ్వానా మహాసభ ఉపాధ్యక్షులు సిడం అర్జు మాస్టర్,జిల్లా మేడి కురిసేంగా మోతిరాం , రాజ్ గోండ్ రాష్ట్ర కార్యదర్శి పెందూర్ సుధాకర్, రాజ్ గోండ్ సేవ సమితి జిల్లా కార్యదర్శి మాడవి నర్సింగ్ రావు, తిర్యాణి మండల సర్ మేడి అడ సాను, మాజీ ఎంపిటిసి ఉప మేడి ఆత్రం లింగు, రాజ్ గోండ్ సేవ సమితి జిల్లా ప్రచార కార్యదర్శి ఆత్రం చందన్ షా, ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షులు ఆత్రం రకు , మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు ఆత్రం లింగారావ్ తదితరులు ఉన్నారు.