జుక్కల్ జులై 8 జనం న్యూస్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా..ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ మహానేత చిత్రపటానికి నియోజకవర్గ నాయకులతో కలిసి నివాళులు అర్పించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు..ఈ సందర్భంగా వారు అందించిన సంక్షేమ, అభివృద్ధి పనులను, సేవలను గుర్తు చేసుకున్నారు..ఎమ్మెల్యే గారి నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో.. ఈరోజు ప్రజలు తమ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చేందుకు క్యాంపు కార్యాలయానికి తరలి వస్తున్నారు..అక్కడికి విచ్చేసిన ప్రజల నుండి ధరఖాస్తులు తీసుకొని వారి సమస్యలు వింటూ..
వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేస్తూ సాధ్యమైనంతవరకు వారి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు..