జనం న్యూస్,జూలై 08,
అచ్యుతాపురం:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జనహృదయనేత సజీవంగా జన హృదయలలో సుస్థిర స్థానాన్ని సాధించిన డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి సందర్భంగా అచ్యుతాపురం మండలం జంగులూరు జంక్షన్, అచ్యుతాపురం సచివాలయం కూడలి నందు గల రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహం వద్ద అచ్యుతాపురం మండలం వైసీపీ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ దేశంశెట్టి శంకర్రావు ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి చేసిన పరిపాలన గురించి వారి అమల చేసిన సంక్షేమ పథకాలు గురించి మాట్లాడుతూ వారిని స్మరించుకున్నారు. అచ్యుతాపురం మండలం ఇంతలా అభివృధి చెందింది అంటే కేవలం రాజశేఖర్ రెడ్డి వలనేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోన సంధ్యా బుజ్జి, జడ్పిటిసీ లాలం రాంబాబు, కో జడ్పిటిసీ నర్మల కుమార్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు సియాద్రి బుజ్జి, మండల మహిళా అధ్యక్షురాలు రాజాన చిటెమ్మ,పార్టీ సీనియర్ నాయకులు మారిశెట్టి సూర్యనారాయణ,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.