జనం న్యూస్ 09జులై పెగడపల్లి ప్రతినిధి.జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో
ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ పిలుపుమేరకు పెగడపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోమండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలోఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ 108 ఇందిరమ్మ ఇల్లు జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు నిర్మాణం చేసి ప్రజల గుండెల్లో నిలిచిన మహానుభావుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ని కొని యాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఒర్గల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనరల్ సెక్రెటరీ చాట్ల విజయభాస్కర్ శ్రీరామ్ అంజయ్య మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం గౌడ్ టౌన్ యూత్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ మండల నాయకులు సంధి మల్లారెడ్డి కడారి తిరుపతి ఇస్లావత్ రవి సింగసాని స్వామి ఆకుల విష్ణు నాయక్ మారం కొమురయ్య నీరటి రాజ్ కుమార్ దీకొండ తిరుపతి కర్ణ కంటి మల్లారెడ్డి గర్వంద రమేష్ గౌడ్ బొడ్డు రమేష్ మల్యాల ఎల్లయ్య మాడిశెట్టి లక్ష్మీనారాయణ పలువురు నాయకులు పాల్గొన్నారు.