జనం న్యూస్ 09జులై పెగడపల్లి ప్రతినిధి.జగిత్యాల జిల్లా
పెగడపల్లి మండలం ల్యాగలమర్రి గ్రామంలోఈరోజు పంచాయతీ కార్యదర్శి శంకర్ తో కలిసి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ భూమి పూజ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్.అనంతరం మాట్లాడుతూ పేదవారి ఇంటి నిర్మాణ కలను సహకారం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ సహకారంతో రాబోయే రెండు సంవత్సరాలలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు మంజూరు చేపిస్తామని వివరించారు.అలాగే ల్యాగలమర్రిలో బిల్లులు పెండింగ్ ఉన్న కుటుంబాలను కలిసి నిబంధనలకు లోబడి నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులు అందరికీ వారం రోజుల్లో బిల్లులు చెల్లింపు జరుగుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలోజిల్లా ఉపాధ్యక్షులు ఒరుగల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చాట్ల విజయభాస్కర్ నాయకులు కడారి తిరుపతి మల్లారెడ్డి కళ్ళేపల్లి రాజు పార్థసారథి పలురు నాయకులు పాల్గొన్నారు.