*బీజేపీ మండల అధ్యక్షులు రామకృష్ణ
జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా పాలన లోని గ్రామ సభలో భాగంగా మండలం లో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది యిట్టి గ్రామసభలలో నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతులకు సంబంధించిన రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా ఈ నాలుగు పథకాలలో నిజమైన అర్హులకు దరఖాస్తు చేసుకున్న వారికి దరఖాస్తు జాబితాలో వారి పేర్లు రాకపోవడం చాలా విడ్డూరంగా ఉందని ఇండ్లు లేని వారికి అద్దె ఇంట్లో ఉంటున్న వారికి కూడా ఇండ్లు ఉన్నాయని వారినీ ఆ జాబితా నుండి వారి పేర్లను తొలగించడం చాలా దౌర్భాగ్యం అని అసలు భూమిలేని నిరుపేదలకు వంద రోజులలో పని దినాలలో 2023 -2024 లో పని చేసిన వారికే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామానడం కొన్ని సంవత్సరాల నుండి జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేసిన వారి పేర్లు ఈ పథకం జాబితాలో లేకపోవడం చాలా సిగ్గుచేటని భూమిలేని వారికి అని చెప్పి ఇలా కొరివిలు పెట్టడం వారి అతి తెలివికి నిదర్శనమని ఈ పథకాలు ఏవి ప్రజల కోసం పెట్టినవి కాదని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను తమ వైపు ఏ విధంగా తిప్పుకోవాలని ఆలోచించి చేసిన ఇందిరమ్మ ఇండ్ల ఎన్నికల డ్రామా అని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి శ్రీకాంత్ సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి చేనేత సెల్ మాజీ జిల్లా కన్వీనర్ వనం దేవరాజ్, సీనియర్ నాయకులు కోమటి రాజశేఖర్, భూత్ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, బత్తుల రాజేష్, పైడిమల్ల సుధాకర్, గొట్టిముక్కుల సుమన్ తదితరులు పాల్గొన్నారు…