జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని గట్లాకానిపర్తి గ్రామానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో సీనియర్ క్లర్క గా పనిచేస్తున్న బోమ్మకంటి నాగారాజు అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న శాయంపేట మండల పిఏసియస్ చైర్మన్ కుసుమ శరత్ బాబు వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి నేడు వారి స్వగ్రామమైన గట్లాకానిపర్తి గ్రామానికి వెళ్లి *కీ శే నాగరాజు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు,వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ…వారి కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.వారికుటుంబ సభ్యులకు దహన సంస్కారాలకు సంఘం నుండి 15000 ఆర్థిక సహాయ అందించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు యలమంచి జైపాల్ రెడ్డి, గుర్రం అశోక్, బగ్గీ రమేష్, చాడ మహేందర్ రెడ్డి, మంద మల్లయ్య, డైనంపల్లి వసంత కార్యాలయ సిబ్బంది పెరుగు శంకర్,నాగెల్లి లింగ మూర్తి,పోషాలు తదితరులు పాల్గొన్నారు…..