జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
ఎస్ఎఫ్ఐ పరకాల మండల కమిటీ ఆధ్వర్యంలో పరకాల మండలంలో ఉన్నటువంటి హైపోత్ పల్లె. వెంకటాపూర్ మలకపేట స్కూల్లో ప్రిన్సిపాల్ టీచర్లతో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులకు చెప్పి తీసుకురావాలన్నారు బడి బాట కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వ స్కూల్లో చదివితే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి ప్రభుత్వ పాఠశాలను రక్షించాలన్నారు. గతంలో మూసి ఉన్న హైబోతు పల్లె స్కూల్.ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా తిరిగి ప్రారంభించారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలన్నారు లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని కళ్యాణ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మణికొండ ప్రశాంత్ పట్టణ కార్యదర్శి కోగిల సాయి తేజ రాజశేఖర్ పాల్గొన్నారు…..