బిచ్కుంద జూలై 8 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలో సెంటర్ లైటింగ్ కు సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ పనులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం రోజు పరిశీలించారు అనంతరం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు.. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి మరియు ఆసుపత్రిలో సమస్యల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.. వర్షాకాలం సందర్భంగా సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు..కావాల్సిన పరికరాలు,మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు..