జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల గొల్లపల్లి లో ఈరోజు,దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా పనిచేసి ఇటీవల బదిలీపై పాటూరు ప్రాథమిక పాఠశాలకు వెళ్లినటువంటి ఉపాధ్యాయుడు వై. మహేశ్వర బాబుకు గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎం.. నాగమల్లేశ్వరి ఎస్. బిలాల్ మరియు గొబ్బిళ్ళ త్రినాధ్ ( గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల కోఆప్టెడ్ నెంబర్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఎల్..నాగయ్య ఎ.అనంతకృష్ణ ,గొబ్బిళ్ళ శ్రీనాథ్ ,గొబ్బిళ్ళ రవి(ఎక్స్ ఉపసర్పంచి ),గొబ్బిళ్ళ నాగముని మిడ్ డే మీల్స్ కుకింగ్ ఏజెన్సీ మండల నాయకులు పి.ఆది నారాయణ బి సుబ్బ రాయుడు,పాఠశాల కమిటీ చైర్మన్ పి సుగుణ, గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.