జనం న్యూస్ జూలై 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలపై, మాజీ ఎమ్మెల్యే అనుచిత వాక్యాలు మానుకోవాలని, మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, ప్రజాపాలనను చూసి ఓర్వలేకే బిఆర్ఎస్ నాయకులు, ఉత్తమ్ దంపతుల మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కోదాడ ప్రజలు గత ఎన్నికల్లో ఎలాంటి తీర్పుని ఇచ్చారో, స్థానిక సంస్థల ఎన్నికలో అదే విధమైన తీర్పును ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు.ఉత్తమ్ దంపతుల మీద ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.