బిచ్కుంద జూలై 9 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ బిచ్కుంద కార్యాలయంలో మంగళవారం రోజు కామారెడ్డి జిల్లాకు పరిధిలో ఉన్న పది మార్కెట్ కమిటీల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం నిర్వహించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో మార్కెట్ ఫీజు వసూళ్లను లీకేజీ లేకుండా వసూలు చేయవలసిందిగా జిల్లా మార్కెటింగ్ అధికారి పి రమ్య గారు నిర్దేశించినారు ఈ సమావేశం నందు కామారెడ్డి జిల్లాలోని 10 మార్కెట్ కమిటీల కార్యదర్శిలందరూ పాల్గొనడం జరిగింది వారితోపాటు ఔట్సోర్సింగ్ సిబ్బంది డిఈఓ లందరూ కూడా హాజరు కావడం జరిగినది, అనంతరం మార్కెట్ కమిటీ ఆవరణలో మార్కెట్ కమిటీ జిల్లా అధికారి పి రమ్య గారు చెట్లు పెట్టినారు , ఇట్టి కార్యక్రమంలో బిచ్కుంద మార్కెట్ కమిటీ సెక్రెటరీ రాజ్ కుమార్ మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు