జనం న్యూస్ జూలై 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ఇందిరా మహిళ శక్తి వేడుకలలో భాగంగా పాపిరెడ్డి నగర్ లోని శ్రీ వీరాంజనేయ శివాలయం ఆవరణలో జి హెచ్ ఎం సి , పి ఓ రాజశేఖర్ ఆధ్వర్యంలో సి ఓ సుజాత ఎంతమాలజీ ఏ ఈ ఓ తేజస్విని సమక్షంలో ఏర్పాటు చేసిన మహిళా సమాఖ్య పాపిరెడ్డి నగర్ పరిధిలోని స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు టి వి పద్మ, ఉట్ల శోభా రాణి మరియు సభ్యులతో జరిపిన సమావేశంలో పాపిరెడ్డి నగర్ కాంటెస్టడ్ అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మన రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులు చేయాలని దృక్పథంతో వడ్డీ లేని రుణాన్ని ఒక మహిళకు ఒక లక్ష నుండి రెండు లక్షల వరకు మరియు ప్రతి ఒక సంఘానికి ఒక లక్ష నుండి ఇరవై లక్షల వరకు ఇచ్చి మీద వివిధ వ్యాపార వృ త్తుల్లో కొనసాగి స్వయం ఉపాధిని పొందేలా ఈ ఇంద్ర మహిళ శక్తి పథకం ఉపయోగపడుతుంది అని శ్రీధర్ రెడ్డి అన్నారు.ఇదే విషయమై పి ఓ రాజశేఖర్ పూర్తిగా వివరించారని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.అదేవిధంగా ఈ వర్షాకాలంలో దోమల నివారణకు సంబంధించి ఏంటమాలాజీ సూపర్వైజర్ నరేష్ చాలా చక్కగా సభ్యులకు వివరించారని,మన ఇంటి ఆవరణలో కాని ఇంట్లో కాని అపరిశుభ్రమైన నీటి నిల్వలను ఉంచకూడదని శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డిని మరియు అధికారులను మహిళలు శాలువాలతో సన్మానించారు.కార్యక్రమంలో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ నరేష్ యాకయ్య,ఆర్ పి లు రాణి,స్వాతి,స్వర్ణలత పెద్ద సంఖ్యలో మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.