జుక్కల్ జులై 9 జనం న్యూస్
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జూకల్ మండల కేంద్రంలో మహాత్మ బసవేశ్వర చౌక్ నుండి. డాక్టర్ అంబేద్కర్ చౌక్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో. అంగన్వాడి. ఆశ. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు. గ్రామపంచాయతీ కార్మికులు. బిచ్కుంద మున్సిపల్ కార్మికులు. అసైన్డ్ పోడు రైతులు. అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో. సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు. సురేష్ గొండ. అజయ్ కుమార్. పాల్గొని మాట్లాడినారు. అంబేద్కర్ విగ్రహం చౌకలో. సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ని తెచ్చింది ఈ నాలుగు లేబర్ కోట్లు కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దుచేసి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటివిటీ చెల్లిస్తూ కనీస వేతనం వివిధ రంగాల కార్మికులందరికీ 36వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా సురేష్ గొండ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 12 గంటల పనిచేయాలని నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం చేసినట్లేనని విమర్శించారు. కార్మికులకి కనీస అవసరాలని కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల జీవితంలో చెలగాటమాడుతున్నాయని. అంగన్వాడి. ఆశ. మున్సిపల్. గ్రామపంచాయతీ. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు. ఆర్ పి ల కు. ఉద్యోగ భద్రత కల్పించాలని స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచిన నేటికీ. పిఎఫ్. ఈఎస్ఐ. సౌకర్యం కల్పించకపోవడం కనీస వేతనాలు అమలు కాకపోవడం. కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనం గా ఉందని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం. జీవో నెంబర్ 2 82. తీసుకొచ్చి కార్మికులకు 10 గంట లు. పనిచేయాలని జీవో జారీ చేయడం కార్మిక వర్గ వ్యతిరేకంగా పనిచేస్తుందనడానికి నిదర్శనమని విమర్శించారు.
ర్యాలీగా వెళ్లి జుక్కల్ తాసిల్దార్ గారికి. అన్ని రంగాల కార్మికులు తమ తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో. సిఐటియు. నాయకులు. సురేష్ గొండ. అజయ్ కుమార్. గోవింద్. వీరన్న. సాయిలు. రూప్ సింగ్. భూమయ్య. సాయిలు. సరస్వతి. నరసింహులు. శ్రీనివాస్ రావు. సిహెచ్. నాగనాథ్. బాలాజీ. వీరితో పాటు. అంగన్వాడి. ఆశ. గ్రామపంచాయతీ. మున్సిపల్. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు. అసైన్డ్ పోడు రైతులు. తదితరులు పాల్గొన్నారు.