జనం న్యూస్ 09జూలై( కొత్తగూడెం నియోజకవర్గం )
ఈనెల 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న 22వ సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు జరిగిన ధర్నాలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రదర్శనగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి హెడ్ ఆఫీస్ కి వెళ్లడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ కొత్తగూడెం రీజియన్ సెక్రటరీ ఎన్ సంజీవ్,ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కే.సారంగపాణి , రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,
ఏఐటియుసి ఎర్రగని కృష్ణయ్య, క్రిస్టఫర్ సిఐటియు బి మధు రమేష్ ఐ ఎన్ టి యు సి కాలం నాగభూషణం
టీజేఎస్ వి బాబు, స్కఖప్స్ కరుణాకర్ యాకయ్య లు పాల్గొన్నారు.