ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్,జూలై 09,అచ్యుతాపురం:
ఎలమంచిలి, నియోజకవర్గ జనవాణి కార్యక్రమం గురువారం జడ్పీ గెస్ట్ హౌస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వయంగా వినతులను స్వీకరించి సమస్యలపై సంబంధిత అధికారులతో అక్కడే చర్చించడం కాలయాపనకాకుండా పూర్తి చేయాలని అధికారులకు సూచించడం అర్జీదారులకు సంతోషం కలిగించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి బుధవారం నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు ఇదే క్యాంపు కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని,ప్రతి బుధవారం ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుందని, ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా పార్టీలతో సంబంధం లేకుండా తన దృష్టికి తీసుకువస్తే వీలైనంత తొందరలో పూర్తి పూర్తిచేసి లబ్ధిదారులకు న్యాయం చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నాలుగు మండలాల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.