జనం న్యూస్- జూలై 9 - నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ పరిధిలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేషనల్ హైవే అథారిటీ ఇంజనీర్స్ మరియు డిస్టిక్ ట్రాఫిక్ రిసోర్స్ బ్యూరో (డి టి ఆర్ బి)ఇన్స్పెక్టర్, రోడ్డు కాంట్రాక్టర్స్ స్థానిక పోలీసు సిబ్బందితో కలసి నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పరిశీలించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి రోడ్డు వెడల్పు, సూచిక బోర్డులు ఏర్పాటు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ ఇంజనీర్స్ సాయిరాం, వెంకటేశ్వర్లు, డి టి ఆర్ బి సి ఐ అంజయ్య మరియు వారి సిబ్బంది నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్, స్థానిక పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.