మద్నూర్ జులై 10 జనం న్యూస్
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా బూత్ లెవల్ అధికారులకు నిర్వహిస్తున్న ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా కామరెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు మద్నూర్ డోంగ్లి మండలాల బూతు లెవల్ అధికారులకు ఎన్నికల నిర్వహణలో వారి పాత్ర, ఓటరు జాబితా రూపకల్పన లో వారి పాత్ర , ఇంటింటి సర్వే, ఫారం 6, 7, 8 లను ఏ విధంగా చేయాలి, దాంట్లో వస్తున్నటువంటి సమస్యలు , పరిష్కారాలపై టీవీ ద్వారా BLO లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బి చందర్ గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన BLO అధికారులే కీలకం అన్నారు. భారత ఎన్నికల సంగ్రామం లో ఓటర్ జాబితా తయారీలో BLO లే కీలకం అన్నారు. BLO లేనిదే ఎన్నికలు, ఎన్నికల సంఘం లేదు అలాంటి గొప్ప పాత్ర BLO లది కావున ఓటర్ జాబితా ను తప్పుడు లేకుండా చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, నాయబ్ తహసిల్దార్ శివరామకృష్ణ, గిర్దవార్ లు శంకర్, సాయిబాబా, రవి, బాలరాజు, దశరథ్, ప్రవీణ్ మరియు రెండు మండలాల BLO లు పాల్గొన్నారు