ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సైదులు మాదిగ.
జనం న్యూస్ జనవరి 25(నడిగూడెం):- తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి సాధనకై ప్రతి మాదిగ పల్లె నుంచి డప్పు తో మోగించి హైదరాబాదు నడిబొడ్డున దండోరా వేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మొలుగూరి సైదులు మాదిగ,ఎమ్మెస్పీ మండల అధ్యక్షులు మిట్టగనుపుల మోష మాదిగలు అన్నారు. శనివారం మండలంలోని బృందావనపురం, వేణుగోపాలపురం గ్రామాలలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పుల వెయ్యి గొంతుకుల సదస్సును విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఆయా గ్రామ కమిటీలను వేశారు. బృందావనపురం గ్రామ శాఖ అధ్యక్షులుగా కంభంపాటి వెంకన్న, ఉపాధ్యక్షులుగా కంభంపాటి హరినాథ్, ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్, కోశాధికారిగా మాతంగి మాధవరావు, వేణుగోపాలపురం గ్రామ శాఖ అధ్యక్షులుగా సంపతి లక్ష్మీనారాయణ,ఉపాధ్యక్షులుగా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా సంపతి ప్రసాద్, కోశాధికారిగా సంపతి వెంకన్నలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ పి జిల్లా కోకన్వీనర్ పందిటి నవీన్ కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు కంభంపాటి శ్రీనివాసరావు, కంభంపాటి నాగేశ్వరరావు, సంపతి రవి,
లక్ష్మీనారాయణ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.