జనం న్యూస్ జూలై 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
గురుపూర్ణిమ సందర్భంగా కూకట్ పల్లి బగ్ అమీర్ శ్రీ బాలాజీ స్వామి ఆలయంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం నందు ఆలయ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ రావు కమిటీ సభ్యులు మరియు ప్రధాన అర్చకులు రమణ అర్చకుల బృందం ఆధ్వర్యంలో ఉదయం విశేష పూజా కార్యక్రమాలు మరియు మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం, సాయంత్రం బాబా వారి పల్లకీ సేవా కార్యక్రమాలను నిర్వహించారు, ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న సమారాధన స్వీకరించి, పల్లకి సేవ ఊరేగింపులో పాల్గొన్నారు.