జనం న్యూస్- జులై 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
గురు పౌర్ణమి సందర్భంగా నాగార్జునసాగర్ లోని పలు దేవాలయాలలో ప్రత్యేక అభిషేకాలు పూజలు కార్యక్రమాలు నిర్వహించారు నందికోట మున్సిపాలిటీ హిల్ కాలనీలోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక పారాయణ కార్యక్రమాలు నిర్వహించి అర్చక గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాధాచార్యులు, రామానుజాచార్యులు, వెంకటాచార్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. పైలాన్ కాలనీలోని మార్కండేయ స్వామి దేవాలయంలో అర్చకులు ఉప్పల శ్రీపాద శాస్త్రి ఆధ్వర్యంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైలాన్ కాలనీలోని కృష్ణ తీరాన ఉన్న దత్తపీఠంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు