జనం న్యూస్,జూలై10,అచ్యుతాపురం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో మార్పుల్ని స్వీకరిస్తూ.. మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో భాగంగా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం మోసయ్యపేట కెజిబివి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పాజిటివ్ పేరెంటింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై వసతులు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,కూటమి నాయకులు పాల్గొన్నారు.