జనం న్యూస్ 10జులై పెగడపల్లి ప్రతినిధి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో మండల తహసీల్దార్ కార్యాలయం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులకు ఎన్నికల అంశం పై శిక్షణ కార్యక్రమం తహసీల్దార్ బి. రవీందర్, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో వారి పాత్ర ఓటర్ జాబితా మరియు రూపకల్పన తదితర అంశాలపై శిక్షణ ఉన్నత అధికారులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, బూత్ అధికారులు, అంగన్వాడీ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.