జనం న్యూస్ 11జులై పెగడపల్లి ప్రతినిధి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోఈరోజు పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మారపల్లి ఎల్లేష్, చైర్మన్ రాములు గౌడ్ తో కలిసి పరిశీలించారు.
మార్కెట్ యార్డులో ఉన్న బండరాళ్లు తొలగించి ధాన్యం ఆరబోయడానికి ప్లాట్ఫారం నిర్మాణం చేయడానికి ఎస్టిమేషన్ తయారుచేసి ఇస్తామని ఈఈ తెలియజేశారు. ఎస్టిమేషన్ కాపీ రాగానే ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో పనులు చేయడానికి అప్రూవల్ తీసుకుంటామని రాములు గౌడ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి కార్యదర్శి వరలక్ష్మి వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి డైరెక్టర్లు చాట్ల విజయభాస్కర్ అజ్మీర అంజి నాయక్ కడప తిరుపతి మండల నాయకులు వరుగల శ్రీనివాస్ కడారి తిరుపతి పూసల తిరుపతి మందపల్లి అంజయ్య తడగొండ రాజు ఆకుల విష్ణు కుంచె రాజేందర్ పాల్గొన్నారు.