జనం న్యూస్ కాట్రేనికోన జనవరి 25 :- ప్రజా స్వామ్యం లో ఓటు వజ్రాయుదం వంటిదని దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాట్రేనికోన తహసీల్దార్ పి సునీల్ కుమార్ పేర్కొన్నారు. జాతీయ ఓటర్లు దినోత్సవం సందర్బంగా స్థానిక సిద్ధార్ధ డిగ్రీ కళాశాల నందు నిర్వహించిన కార్యక్రమం లో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు ను ఉద్దేశించి అయన మాట్లాడుతూ ప్రజా స్వామ్యం లో ఓటు చాలా విలువైనదని, దాని పవిత్ర తను అందరూ కాపాడాలని పిలుపునిచ్చారు. ఓటు ఆవశ్యకత ను గ్రామీణ ప్రాతం లో విద్యార్థులు తెలియజే యాలని కోరారు. అనంతరం డిగ్రీ కాలేజీ నుండి కాట్రేనికోన గేట్ సెంటర్ వరకూ ఫ్లెక్సీ లు పట్టుకొని, ప్లకార్డు లు చేతబట్టి " ఓటు హక్కు -జన్మ హక్కు ', ఓటు కు నోటు - ప్రజా స్వామ్యం కు చేటు ' వంటి నినాదాలు చేస్తూ గేట్ సెంటర్ కు చేరుకొని మానవహారం నిర్వహించారు అనంతరం ఎన్నికల కమిషన్ ఆదేశాలు ప్రకారం ప్రతిజ్ఞ నివాహించారు.విద్యార్థులు ఆర్ కు స్వీట్స్ పంచారు. కార్యక్రమం లో ఆర్ ఐ జి సత్యవేణి, సెక్రటరీ ఎం నాగరాజు, అధ్యాపకులు ఎం సతీష్, కే రవి, ఏ శ్రీనివాస్, వెంకట కృష్ణ, శ్రీను బాబు, వి అర్ ఓ లు వెంకటేశ్వర రావు, కళ్యాణ్ సింగ్ , సుష్మ, జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర రావు , రెవిన్యూ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు