జనం న్యూస్ ;10 జులై గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి;
ఆషాడ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని శివాజీ నగర్ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పుర ప్రముఖ పురోహితులు దేశపతి గంగాధర శర్మ గారు, ఉమాపతి రామేశ్వర శర్మ గారు ,అచల బోధకులు నరసింహ స్వామి గౌడ్ గారిని ఆహ్వానించడం జరిగింది మరియు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభోత్సవం చేస్తూ అతిధులు గురుపౌర్ణిమ విశేషతను తెలియజేస్తూ ఈరోజు వ్యాస భగవంతుని యొక్క జన్మదినాన్ని గురు పౌర్ణమి గా జరుపుకుంటాము వ్యాసభగవానుడు మానవ సృష్టి కల్యాణం కోసం వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతం గ్రంథాలని రచించి ఈ సృష్టిలోని అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని అందించారని, గంగాధర శర్మ గారు మాట్లాడుతూ జ్ఞానాన్ని బోధించే ప్రతి ఒక్కరు మనకు గురువులే వాళ్లని మనం పూజించుకోవాలి, ప్రతి ఒక్కరి లోపల ఏదో ఒక విశేషత ఏదో ఒక విషయం యొక్క జ్ఞానం ఉంటుంది, మన ఉన్నతి కోసము ప్రతి ఒక్కరు మనకు ఏదో విషయంలో జ్ఞానాన్ని నేర్పించేవారు ఉంటారని తెలియజేశారు, అఖిల బోధకులు నరసింహ గౌడ్ గారు మాట్లాడుతూ ధ్యానము ద్వారా ఆత్మకి ప్రశాంతత లభిస్తుందని, మౌనంలో ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని తాను తరచు మౌనంగా ఉంటానని చెప్పారు మరియు అతిథులందరూ బ్రహ్మా కుమారీస్ వారు ఈ కార్యక్రమాని నిర్వహించి మమ్మల్ని సత్కరించడం మాకు చాలా ఆనందదాయకంగా సంతోషం అనిపించిందని తెలియజేశారు అనంతరం సంస్థ నిర్వాహకురాలు బి కే భవాని, సంస్థ సభ్యులతో కలిసి అతిథులకు శాలువాలు, పూలమాలలతో సత్కరించి ఈశ్వరీయ కానుకను అందించడం జరిగింది, అలాగే నిర్వాహకురాలు మాట్లాడుతూ పరం సద్గురువు పరమాత్మ మనందరికీ గురువు అని, వారంధించే జ్ఞానం ద్వారా మనము గృహస్థ జీవితాన్ని శాంతియుతంగా, ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చని అందుకని చెప్తారు భగవంతుని అందరూ నమ్ముతారు కానీ భగవంతుడు చెప్పినది ఎవరు నమ్మరు ( చేయరు) అందుకే మనకి ఈ దుఃఖాలు కాబట్టి ఆ పరం సద్గురువు పరమాత్మ నడిపించిన మార్గంలో నడుస్తూ సిద్దిపేట పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను . ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొన్నవారు సంస్థ ప్రతినిధులు బి కే స్వప్న బి కే స్రవంతి ఓంకారం వెంకటేశం, అమరేందర్ రెడ్డి, ఆంజనేయ చారి,డా. ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.