జనం న్యూస్ జులై 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు అభివృద్ధి అధికారి డి సులోచన కు వినతి పత్రం సమర్పించిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగరి సాంబయ్య అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో 50 సంవత్సరాలు నిండిన పద్మశాలి కి చెందిన అర్హులైన వారందరికీ జియో టాగ్ తో సంబంధం లేకుండా ఆసరా పింఛన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు సాంబయ్య అన్నారు ఉమ్మడిరాష్ట్రంలో 1500 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నదని ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని తెలిపారు చేనేత పవర్ లూమ్స్ కార్మికులకు సరిపడా పని లేక పని భద్రత లేని కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే ఆత్మహత్యల నివారణకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు అర్హులైన వారందరికీ ఐదు వేల రూపాయల ఆసరా ఇవ్వాలని అన్నారు
చేనేత కార్మికులు చనిపోతే వారి స్థానంలో వారి భార్యలకు ఆసరా పింఛన్ ఇవ్వవలసి ఉండగా గత ప్రభుత్వము ఇవ్వలేదు నేటి ప్రభుత్వం కూడా అదే బాటలో కొనసాగుతున్నారనిమరణించి వారి పెండింగ్ లో ఉన్న చేనేత కార్మికుల స్థానంలో వారి భార్యలకు ఆసరా పింఛను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండల ప్రధాన కార్యదర్శి సామల ధనుంజయ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డి రమేష్ జిల్లా నాయకుడు బాసని బాలకృష్ణ పద్మశాలి మండల మహిళా అధ్యక్షురాలు బాసని శాంత మండల నాయకులు చిందం రవి, భాషని మల్లికార్జున్ , దిడ్డి ప్రభాకర్,
ముదిగొండ సంతోష్, మోత్కూరి సత్యనారాయణ కొండ ముకుందం , వనం దేవరాజు, కోమటి శేఖర్, దాసరి రవి, రంగు మహేందర్, గొట్టిముక్కుల రాజు తదితరులు పాల్గొన్నారు….