*కొమురం భీమ్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి.
జనం న్యూస్ 10జూలై. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్). జిల్లా స్టాఫ్ రిపోటర్.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అధ్యక్షతన జిల్లా స్థాయి దిశ కమిటీ త్రైమాసిక సమావేశానికి కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, పి.ఒ. ఖుష్బు గుప్తా,అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, డి.ఎఫ్.ఒ. నిరజ్ కుమార్, డి.ఆర్. డి. ఒ. దత్తా రావు, తో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో దిశ కమిటీ పాత్ర కీలకమని, జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని పునరుద్ఘాటించారు. నిధుల సక్రమ వినియోగం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరును సమీక్షించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూడాలని, పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యం గా కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా ప్రగతికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.ఈ కార్యక్రమం లో వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు