జనం న్యూస్ జనవరి 25 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కెపిహెచ్బి కాలనీ వసంత నగర్ సొసైటీ నందు రెనోవా హాస్పిటల్ వారి సౌజన్యంతో మందలపు రోజారాణి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత లివర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయటం జరిగింది.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ టెస్ట్ ల గురించి వాటి యొక్క ప్రత్యేకతలు గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు… డాక్టర్లు ఈ టెస్టులు గురించి వివరాలు తెలియజేయడం జరిగింది ..లివర్ ఏ విధంగా ఉంటుంది.. ఆ అవయవానికి సంబంధించి డాక్టర్లు క్లుప్తంగా చెప్పడం జరిగింది ..ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఇలాంటి టెస్టులు ప్రస్తుతానికి ఎక్కడ అందుబాటులో లేదని ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు మందలపు సాయిబాబా చౌదరిని అభినందించారు.. ఈ కార్యక్రమానికి సుమారు రెండు వందల మందికి పైగా హాజరయ్యి లివర్‌కు సంబంధించిన టెస్టులు చేపించుకున్నారు…ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న గోరే..కాలనీవాసులు శ్యామలరాజు, కృష్ణారెడ్డి, నాగేశ్వరరావు, రత్నాకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు..