జనం న్యూస్ జులై 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన శ్రీ షిరిడి సాయినాద మందిరం 28వ వార్షికోత్సవం మరియు ఆషాఢ మాస గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్, శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజేందర్ కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలతో ఆశీర్వదించి ఘనంగా సత్కరించారు.అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ శ్రీ షిరిడి సాయినాథుడు విశ్వాసం, సహనం, సేవ అనే మూడు మూల్యాలతో సమాజానికి మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. గురు పౌర్ణమి రోజు గురువుల పట్ల కృతజ్ఞతలు తెలియజేసే పవిత్ర దినంగా భక్తి, ఆధ్యాత్మికత కలగలిసేలా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు కార్యకర్తలు,ప్రముకులు, సాయి బాబ భక్తులు,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఎంతో వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు