ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జులై 10:
ఏన్కూర్ లో శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురువారం 26వ వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమి తిధిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. వ్యాస మహర్షి జన్మదినాన్ని గురు పౌర్ణమి గా పిలుస్తారు. ఈ సందర్భంగా సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు ఆవుల నర్సయ్యను సన్మానించారు. గురు పౌర్ణమి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళాకారులను కొవ్వూరు నాగేశ్వరావు సన్మానించారు.