వేస్తే గృహ యజమాని, ప్రైవేటు వ్యక్తుల పై చర్యలు తప్పవు.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- పట్టణంలోని ఏపీఎంఎఫ్ పాత్రికేయ యూనియన్ సభ్యులు శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబును మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని పారిశుధ్యం, మంచినీరు, వంటి విషయాలపై యూనియన్ సభ్యులు, కమిషనర్ తో చర్చించడంజరిగింది. పట్టణంలోని పట్టణంలోని పలు వార్డులలో ప్రజల, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో, పురపాలక సంఘ నిధులతో ఏర్పాటుచేసిన సిమెంట్ రోడ్లను పలువురు గృహనివాసాలకి, చలానాలు చెల్లించకుండా, పురపాలక సంఘానికి నీటి కుళాయిలకు చలానా చెల్లించి అనుమతి పొందకుండా ఇష్టం వచ్చినట్లు ప్రైవేటు వ్యక్తుల ద్వారా నీటి కుళాయిలు అమర్చుకుంటున్నారని, కమిషనర్ తో ప్రస్తావించగా, అటువంటి వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, అలా ఎవరైనా నీటి కుళాయిఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ శాఖకు సంబంధించిన అధికారుల, వాట్సాప్ నెంబర్లకు ఫోటో పెడితే చాలని, లేదా నా నెంబర్ కైనా వాట్సాప్ చేయవచ్చని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలియజేశారు.