జనం న్యూస్ జూలై 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేని కొన ఫ్రెండ్లీ క్లబ్ సభ్యురాలు, ఉన్నత విద్యావంతురాలు శ్రీమతి ఆణివిళ్ళ శ్రీవాణీ సుబ్బలక్ష్మికి, మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ నందు తెలుగు సాహిత్యంలో విశ్రాంత ఆచార్య డా. ఆకొండి విశ్వనాథం వారి ముత్యాల శాల వచన కావ్యమునకు డా. జీ.బి. ఆనంద్ కుమార్ పర్యవేక్షణలో పరిశోధన, సమగ్ర పరిశీలనకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కోన రాంజీ చేతుల మీదుగా డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అందుకున్న సందర్భంగా సుబ్బలక్ష్మిని ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి, కాట్రేనికోన లో తేజస్విని జ్యోతిషాలయం వేదికగా ఘనంగా సత్కరించారు. ఈ సభకు విచ్చేసిన గౌరవ అధ్యక్షుడు తాతపూడి లక్ష్మీ నారాయణ మూర్తి, అధ్యక్షుడు గ్రంథి నానాజీ, సుంకర పవిత్ర కుమార్, మల్లాడి రాధాకృష్ణ, చల్లా గోపి, ఆకొండి ఉమ మహేష్ శర్మ, ఆకొండి సాయి కిరణ్, తాతపూడి కృష్ణ, డాక్టర్ ఏ కాశ్యప్ , సుంకర బుజ్జి, కోటపల్లి నరేంద్ర, ఆకొండి వేంకట సూర్య నారాయణ మూర్తి, శ్రీమతి ఆకొండి సూర్యకాంతం, ఆకొండి లీల తదితరులు డాక్టర్ శ్రీవాణిని అభినందించారు.