జనం న్యూస్ జూలై 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మునగాల మండల పరిధిలోని పలు సహకార సంఘాల్లో, ప్రైవేట్ దుకాణాల్లో యూరియా నిల్వలను మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మునగాల మండల రైతులకు సరిపడా యూరియా మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువులు మండలంలోని ఆకుపాముల, మునగాల,తాడ్వాయి, కొక్కిరేణి సహకార సంఘాలలో మరియు మునగాలలో ప్రైవేట్ దుకాణాలలో మొత్తం కలిపి 7097 బస్తాల యూరియా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ప్రస్తుతం వరి నారుమడి దశలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి సరిపడా యూరియా మాత్రమే తీసుకోవాల్సిందిగా రైతులను కోరారు.రైతులు యూరియా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు. రైతులు యూరియాను అధికంగా వాడటం వల్ల భూమి దెబ్బతిని,వాయు కాలుష్యం, నీటి కాలుష్యం జరిగి, ఆరోగ్య సమస్యలతో పాటు,ముందు ముందు పంట దిగుబడులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.కావున యూరియాను తక్కువ మోతాదులో పంటలకు ఉపయోగించాలని కోరారు.