జనం న్యూస్ జూలై 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అమలాపురం సమీపంలో చెయ్యురు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవమును పురస్కరించుకుని అవగాహనా సదస్సును కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ డి.వి .ఎన్ ఎస్ వర్మ గారు ప్రారంభించారు. ఈ సందర్భగా అయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జులై 11 తేదీన ప్రపంచ జనాభా దినోత్సవమును జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా జనాభా పెరుగుదలవల్ల కలిగే సమస్యలన్నీ నీరు, వసతి, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరములు తీర్చుట కష్టతరమవుతుందని , ఇదీ ఆర్ధిక అసమానతలకు దారితీస్తుందని, పర్యావరణం పై ప్రతికూల ప్రభావం చూపుతుందని దీనిని నియత్రించుటకు కుటుంబ నియంత్రణ, యువతను శక్తీ వంతం చేయడం ద్వారా, తమ కుటుంబ నిర్మాణంలో పాత్రవహించుట ద్వారా అరికట్టవచ్చునని వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ డి.వి .ఎన్ ఎస్ వర్మ, కళాశాల ప్రిన్సిపాల్ డా॥ కే సురేష్ బాబు , కళాశాల పాలక వర్గ సభ్యులు శ్రీ సందీప్ లు, వైస్ ప్రిన్సపాల్ కె వి వి బాపి రాజు , కళాశాల విద్యాశాఖాధికారులు డా॥ టి. రవి కుమార్, డా॥ వై. వెంకట్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ ఎం వెంకటేశ్వర రావు, కళాశాల వివిధ విభాగాధి పతులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.