జనం న్యూస్ జులై 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడి మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. మండల యువజన అధ్యక్షుడు దుర్గం ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 7000కుపైగా, నియోజకవర్గంలో 3500కి పైగా ఇళ్లు మంజూరయ్యాయి. వాంకిడిలో 389 ఇళ్లు ఇచ్చారు. ఇసుక కోసం డీడీ చలాన్ అవసరం లేకుండా 1450 రూపాయలు చెల్లించకుండానే తాసిల్దార్ కార్యాలయంలో ధ్రువపత్రంతో పొందవచ్చని పేర్కొన్నారు.