మహిళలు అన్ని రంగాలలో రాణించాలి. ఏ.పి.యం. టిక్యా నాయక్.
జనం న్యూస్, జూలై 12, బర్దిపూర్ గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.
( జహీరాబాద్, నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామంలో, ఇందిరా మహిళా శక్తి సంబరాలు, ఏ. పి. యం. టిక్యా నాయక్ ఆధ్వర్యంలో, ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, బ్యాంకులద్వారా వడ్డీ లేని రుణాలు, మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, పెట్రోల్ పంపులు నిర్వహణ, బస్సులను కొని అద్దెకివ్వడం, అప్పు తీసుకున్న వ్యక్తులకు ఋణ భీమా, మరియు ప్రమాద బీమా వంటి అంశాలపై, కళాకారులు పాడిన పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏపీయం టిక్యా నాయక్ మాట్లాడుతూ, మన రాష్ట్ర ప్రభుత్వం, మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా, మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, వారికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, మహిళా సంఘాలకు, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి, వారిని కోటీశ్వరులను చేయుటకు మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, బస్సులను కొని అదేకివ్వడం, అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ,కోళ్ల మరియు పశువుల పెంపకం, మొదలైన పథకాలకు బ్యాంకు ఋణాలు, అప్పు తీసుకున్న వ్యక్తులకు ఋణ భీమా, మరియు ప్రమాద బీమా, పథకాలను అమలు చేస్తూ, మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో, భర్ధిపూర్, పొట్టి పల్లి,కుప్పా నగర్, ఝరాసంగం, చిలపల్లి, వనం పల్లి, గ్రామ సంఘాల సభ్యులు. సీ.సీ.లు. మండల సమైక్య అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, క్లస్టర్ కోఆర్డినేటర్లు, మండలంలోని ఆ యా గ్రామల, గ్రామ సంఘం సహాయకులు, ( వీ. ఓ. ఏ ) లు, గ్రామ సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.