జనం న్యూస్ 12 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లాలో వ్యవసాయం సాగు తగ్గకుండా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కలెక్టర్ అంబేడ్కర్ని కోరారు. ఈ మెరకు శుక్రవారం కలెక్టర్ని కలిసి జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు సాగుకోసం పడుతున్న ఇబ్బందులకు సంబంధించి వినతిపత్రం అందజేశారు.