జనం న్యూస్ 12 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
రాజీవ్ నగర్ కాలనీలో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లిమర్ల మండలం తోంపలపేటకి చెందిన మణికి పూసపాటిరేగ మండలం ఎరుకొండ గ్రామానికి చెందిన సురేశ్‌తో పెళ్లయింది. వీరి మధ్య గొడవలు రావడంతో రాజీవ్‌నగర్ కాలనీలో ఉండే పెద్దమ్మ వద్దకు మణి వచ్చింది. గురువారం బాత్ రూంలో ఉరివేసుకోగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.