ముఖ్యఅతిథిగా కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ జువ్వాడి నరసింగరావు
( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జారపు శ్రీనివాస్ ) జనం న్యూస్, జులై 12, జగిత్యాల జిల్లా
, మెట్ పల్లి : పట్టణంలోని ఉదిత్ రెడ్డి గార్డెన్లో మెట్టుపల్లి వెండి బంగారు వర్తక సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది, ఈ ప్రమాణ స్వీకారం లో భాగంగా అధ్యక్షుడిగా బెజ్జారపు నవీన్, ఉపాధ్యక్షుడిగా గాలిపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా తిప్పర్తి వెంకటేష్, కోశాధికారిగా ఇల్లెందుల ఉదయ్, సహాయ కార్యదర్శిగా తోగేటి నరేష్, ప్రమాణ స్వీకారం చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ తనని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినందుకు సంతోషిస్తూ స్వర్ణకార సర్వస్యలు తనకు తెలుసునని, న్యాయబద్ధతగల ఏ సమస్య వచ్చిన నన్ను నిర్మొహమాటంగా సంప్రదించగలరని తెలిపారు, ఈ కార్యక్రమంలో, బెజ్జారపు మురళి, బెజ్జారపు శ్రీనివాస్, మెట్టుపల్లి స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వంగల మహేష్, కోరుట్ల మరియు జగిత్యాల స్వర్ణకార సంఘం వ్యాపార సంఘ అధ్యక్షులు, మెట్ పల్లి స్వర్ణకార వ్యాపార సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు