జనం న్యూస్ జూలై 12:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగాపడాల రాజేశ్వర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత శనివారం రోజునా తాళ్ళరాంపూర్ బస్సు స్టాండ్ దగ్గర గ్రామ ప్రజలతో మాట్లాడుతూ మాదక ద్రావ్యలు గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలిఅని అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తి మీకు ఫోన్ చేసి మీ ఫ్రెండ్ మీతో మాట్లాడుతాడట కాన్ఫరెన్స్ కలపుతున్న మీరు లైన్ లో ఉండండి అని వారితో మాట్లాడే ఏర్పాటు చేసిన తర్వాత మూడవ వ్యక్తి ఫోన్ కట్ చేయగానే మన ఫోన్ నుండి ఓటీపీ మొదట ఫోన్ చేసిన వ్యక్తి కి వెళ్ళగానే మన బ్యాంకు లో ఉన్న డబ్బులు వారి ఖాతాకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అందువలన తెలియని వ్యక్తులుఫోన్ చేస్తే కట్ చెయ్యాలి. రైతు బందు, పీఎం కిసాన్ డబ్బుల విషయం ఏదైనా బ్యాంకునుండి కానీ తెలియని నెంబర్ నుండి కానీ వెబ్ లింక్ లు వాట్సాప్ అప్ లోవస్తే ఓపెన్ చెయ్యవద్దు. వీడియోలు వచ్చినవాటిని డౌన్లోడ్ చెయ్యవద్దుమరియు వాట్సాప్ నుండి ఫోన్ వస్తే మాట్లాడకుండా కాల్ ను కట్ చేసి మనమే డైరెక్ట్ గా కాలుచేసిమాట్లాడాలి అని మాట్లాడారు. మీకు ఏదైనాసైబర్ మోసం జరిగినట్లయితే గంటలోపల పోలీస్ స్టేషన్ కు వస్తే మీ సమస్య లను పరిష్కారం చెయ్యవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి, బాల్కొండ బ్లాక్ అధ్యక్షుడు ఆడేం గంగప్రసాద్,మాజీ సర్పంచ్ భీమానాతి భాను ప్రసాద్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తుమ్మల దేవానంద్,ఇట్టేడి రాజ్ కుమార్, బద్దం దేవేందర్,క్యాతం మధు సూదన్, గ్రామ ప్రజలు మరియు ఏఎస్సైలక్ష్మణ్ నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.