జనంన్యూస్. 12.సిరికొండ. ప్రతినిధి.
సిరికొండ పోలీస్ స్టేషన్కు ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జె. రామకృష్ణ కి ఘనసన్మానం జరిగింది.స్థానిక BJYM (భారతీయ జనతా యువ మోర్చా)సిరికొండ మండలం అధ్యక్షుడు పోతుగంటి మధు గారి ఆధ్వర్యంలో ఆయనకు శాలువా కప్పి సత్కరించి, అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు మాట్లాడుతూ, స్థానిక నాయకులు "ప్రజలకు సేవ చేసే పోలీస్ అధికారులు భద్రత మరియు న్యాయ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని" ప్రశంసలు కురిపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎస్ఐ రామకృష్ణ కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు విష్ణు, గంగాదాస్, ప్రధాన కార్యదర్శి రణదీష్, చందు తదితరులు పాల్గొని ఎస్సై కి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ జె. రామకృష్ణ గారు మాట్లాడుతూ:"ప్రమాదాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ నా మొదటి కర్తవ్యాలు. ప్రజల సహకారం ఉంటే పోలీస్ వ్యవస్థ మరింత సమర్థంగా పని చేయగలదు" అని పేర్కొన్నారు.