జనం న్యూస్ 12జూలై. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్). జిల్లా స్టాఫ్ రిపోటర్.
జైనూర్: టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియమితులై తొలిసారి శనివారం జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆత్రం సుగుణక్కకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్,మండల అధ్యక్షుడు షేక్ ముఖిద్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసేవారికి తప్పకుండా పదవులు వస్తాయని..అందుకు తానే ఉదాహరణ అని తెలిపారు.తనపై ఎంతో నమ్మకంతో అధిష్టానం పెద్దలు టిపిసిసి ఉపాధ్యక్షురాలుగా, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతలను అప్పగించిందని ఈ పదవులను బాధ్యతతో నిర్వర్తిస్తానని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పని చేయాలని, పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు కనక ప్రతిభ, మెస్రం భూపత్, నాయకులు మెస్రం అంబాజీ రావు, లింగు, కృష్ణ, సింధు,అజ్జు లాల, దత్తు,హైదర్,కోటేశ్వర్, ప్రణిత, యాదోవ్ రావ్ తదితరులు పాల్గొన్నారు.