జనం న్యూస్ జనవరి 25(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం స్థానిక వజ్రకరూరు వెలుగు ఆఫీస్ నందు ఏపీఎం లలిత ఆధ్వర్యంలో మండల స్థాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా, ఈవోపీఆర్డి దామోదర్ రెడ్డి, ఎంఈఓ ఎర్రిస్వామి హాజరై మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుతం కాలానుగుణంగా మహిళలు ఆర్థికంగా ఎలా ఎదగాలి,ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత,వాణిజ్య నైపుణ్యాలు,ఆరోగ్య సంరక్షణ, మరియు వివిధ అంశాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు,ఏపీఎం లలిత మాట్లాడుతూ మహిళలు పిల్లల సంరక్షణ,విద్య కుటుంబ సంక్షేమం, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, స్థానికంగా మహిళలు ఉపాధిని పొందే లక్ష్యంతో ముందుకెళ్లాలని ప్రభుత్వం ఈ ఉల్లాస్ కార్యక్రమం ఏర్పాటు చేసిందని,ఈ కార్యక్రమంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాలంటీర్లందరికీ మండల స్థాయి లెవెల్లో శిక్షణ ఇచ్చి, గ్రామాల్లో మహిళలు సొంతంగా పనులు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు,ఉల్లాస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోస్టర్లను ఆవిష్కరించి, అనంతరం విద్యాసామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో సీసీలు, యానిమేటర్లు,మహిళా సంఘాల లీడర్లు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు